
ఇందిరా డెయిరీ వాటాధనం పక్కదారి
బోనకల్: మధిర నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేయనున్న ఇందిరా డెయిరీలో మహిళా సంఘాల సభ్యులకు సభ్యత్వం ఇస్తుండగా, కొందరి వాటాధనం పక్కదారి పట్టినట్లు తేలింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. ఇందిరా డైయిరీలో సభ్యులుగా చేరేందుకు మహిళలు రూ.2,100 చెల్లించాల్సి ఉంటుంది. వాటాధనాన్ని గ్రామంలోని వీఓఏలు వసూలు చేసి మండల సమాఖ్యకు చెల్లించాలి. అయితే, మండలంలోని రాపల్లి వీఓఏలు సభ్యుల నుంచి రూ. 2,100 చొప్పున వసూలు చేసినా మండల సమాఖ్యకు చెల్లించలేదని బయటపడింది. ఆన్‌లైన్‌లో పరిశీలించగా ఈ విషయాన్ని గుర్తించిన సభ్యులు సీసీ శ్రీనివాసరావును అడిగితే ధాటవేత దోరణిలో సమాధానం చెప్పినట్లు తెలిసింది. దీంతో డబ్బులు చెల్లించిన సభ్యులు ఇటీవల ఐకేపీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఈ అంశంపై ఏపీఎం సురేంద్రబాబును వివరణ కోరగా డబ్బు చెల్లించిన సభ్యులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. రోజులు గడుస్తున్నా స్పష్టత లేకపోవడంతో సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని వారు కోరుతున్నారు.
మండల సమాఖ్యలో జమ చేయని వీఓఏలు