
సమస్యల పరిష్కారమే అజెండాగా కార్యాచరణ
ఖమ్మంమయూరిసెంటర్: ప్రజా సమస్యల పరిష్కారమే అజెండాగా కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని సీపీఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు సూచించారు. సీపీఐ జిల్లా కార్యవర్గ సమావేశం సోమవారం తోట రామాంజనేయులు అధ్యక్షతన ఖమ్మంలో సోమవారం జరగగా ఆయన మాట్లాడారు. పాలకులు ప్రజలను విస్మరించినందున ప్రజాసమస్యలు గుర్తించి పరిష్కారా నికి ఉద్యమాలు చేపట్టాలని తెలిపారు. కాగా, కేంద్రప్రభుత్వం కార్పొరేట్ల మేలు కోసమే పనిచేస్తోందని ఆరోపించారు. ఇక రాష్ట్రంలో రుణమాఫీ సంపూర్ణంగా అమలుచేయలేదని విమర్శించారు. ఈనెల 19, 20వ తేదీల్లో మధిరలో జరిగే పార్టీ జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని సూచించారు. నాయకులు దండి సురేష్, మౌలానా, జమ్ముల జితేందర్‌రెడ్డి, క్లెమెంట్, యర్రా బాబు, ఎస్.కే.జానీమియా, లతాదేవి పాల్గొన్నారు.