
పాముకాటుతో మహిళ మృతి
పెనుబల్లి: ఇంట్లో పనిచేసుకుంటున్న మహిళకు పాము కాటు వేయడంతో మృతి చెందింది. మండలంలోని ముత్తగూడెంకు చెందిన గరిడి నాగేశ్వరరావు భార్య విజయలక్ష్మి (35) సోమవారం ఉదయం ఇల్లు శుభ్రం చేస్తుండగా కాలి బొటన వేలిపై పాము కాటు వేసింది. దీంతో ఆమెను తిరువూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లేలోగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆమెకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.
కుటుంబ కలహాలతో ఆత్మహత్య
మధిర: కుటుంబ కలహాల నేపథ్యాన ఓ ఒక వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఏపీలోని విజయవాడకు చెందిన కత్తి బాబ్జీ(57) హైదరాబాద్ యూసఫ్‌గూడలోని ఒక అపార్ట్‌మెంట్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య, కుమారుడు ఉండగా వారిద్దరు ఏడాదిగా వేరే నివసిస్తున్నారు. ఈ క్రమాన మనస్తాపానికి గుౖరైన బాబ్జీ ఆదివారం సాయంత్రం మధిర చేరుకుని ఒక హోటల్‌లో గది అద్దెకు తీసుకున్నాడు. అయితే, సోమవారం ఉదయం తలుపు తీయకపోవడంతో సిబ్బంది బలవంతంగా తెరిచి చూడగా బాబ్జీ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఉన్నాడు. దీంతో మధిర టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు.