
కల్లూరు అప్పయ్య, సంక్రాంతి లఘుచిత్రాలకు అవార్డులు
ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మంకు చెందిన కొత్తపల్లి శేషు రచన, దర్శకత్వంలో రూపొందిన కల్లూరు అప్పయ్య, సంక్రాంతి–2కే25 లఘుచిత్రాలకు మలేషియా సినీ ఆవార్డ్స్ సంస్థ అవార్డులు ప్రకటించింది. ఈ సినిమాలకు గాను ఉత్తమ రచయిత, దర్శకుడు, స్క్రీన్ ప్లే అవార్డులు కొత్తపెల్లి శేషుకు, ఉతమ నిర్మాతగా గుజ్జూరిఽ శ్రీధర్‌బాబుకు, ఉత్తమ నటులుగా మొగిలి గుణకర్, నల్లగట్ల కిషోర్‌బాబుతో పాటు ఉత్తమ నటిగా మహేశ్వరి, యామినికి అవార్డులు లభించాయి. జిల్లాకు చెందిన దర్శకుడు, నటులు అవార్డులు సాధించడంపై మిత్రా గ్రూప్ చైర్మన్ కురువెళ్ల ప్రవీణ్‌కుమార్, డాక్టర్ కూరపాటి ప్రదీప్‌కుమార్, కాపా మురళీకృష్ణ, నటుడు కాంతేశ్వరరావుతో పాటు పలువురు కళాకారులు అభినందించారు.

కల్లూరు అప్పయ్య, సంక్రాంతి లఘుచిత్రాలకు అవార్డులు