కిసాన్‌ కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

కిసాన్‌ కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలి

Jul 15 2025 7:03 AM | Updated on Jul 15 2025 7:03 AM

కిసాన

కిసాన్‌ కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలి

కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు దుర్గాప్రసాద్‌

ఖమ్మంమయూరిసెంటర్‌: కిసాన్‌ కాంగ్రెస్‌ను గ్రామీణ ప్రాంతం నుండి బలోపేతం చేయాల ని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ దుర్గ ప్రసాద్‌ సూచించారు. ఖమ్మంలోని కాంగ్రెస్‌ కార్యాలయంలో సోమవారం జరిగిన కిసాన్‌ కాంగ్రెస్‌ కార్యవర్గ సమావేశంలో ఆయన మా ట్లాడారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల కోసం అమలుచేస్తున్న పథకాలను క్షేత్రస్థాయిలో వివరించాలని తెలిపారు. సీతారామ ప్రాజెక్టు జలా లతో జిల్లా సస్యశ్యామలం కానుందని చెప్పా రు. త్వరలో కిసాన్‌ కాంగ్రెస్‌ గ్రామ అధ్యక్షుల శిక్షణ ఏర్పాటుచేయనుండగా, ఆలోగా కమిటీ ల నియామకం పూర్తిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి నూతి సత్యనారాయణ, కిసాన్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షులు మొక్క శేఖర్‌ గౌడ్‌, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావుతో పాటు వివిధ మండలా ల నాయకులు వల్లూరి భద్రారెడ్డి, భూక్యా చిననాయక్‌, శీలం బ్రహ్మారెడ్డి, గాదె ప్రసాద్‌, కడియాల సుధాకర్‌, చింతనిప్పు మాధవరా వు, గుత్తా గంగయ్య, మూడుముంతల గంగరాజు, ప్రతిభారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

భద్రాద్రి అడిషనల్‌

డీఎంహెచ్‌ఓగా సైదులు

ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం జిల్లా డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ బి.సైదులుకు ఉద్యోగోన్న తి లభించింది. ఆయనను భద్రాద్రికొత్తగూడెం జిల్లా అడిషనల్‌ డీఎంహెచ్‌ఓగా నియమిస్తూ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ బి. రవీంద్రనాయక్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. డాక్టర్‌సైదులు ఖమ్మం జిల్లాలో సుదీర్ఘకాలం వివిధ విభాగాల ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించారు. ఆయన పదోన్నతి పొందిన సందర్భంగా అధికారులు, ఉద్యోగులు అభినందించారు.

వైదిక సంఘం

జిల్లా నూతన కమిటీ

ఖమ్మంగాంధీచౌక్‌: వైదిక సంఘం జిల్లా నూతన కమిటీని ఖమ్మంలో ఎన్నుకున్నారు. మూడేళ్ల కాలా నికి ఎన్నుకున్న ఈ కమిటీలో అధ్యక్షుడిగా తాటికొండల సీతారామశాస్త్రి, ప్రధాన కార్యదర్శిగా కాండూరి ఆదిత్య సరస్వతీకుమార్‌ ఎన్నికయ్యారు. అలాగే, కోశాధికారిగా కొనకంటి ప్రసాద్‌ శర్మలను ఎన్నుకున్నట్లు దేవలపల్లి ఆంజనేయశర్మ, కొనకంచి సాయిరాముశర్మ తెలిపారు.

విద్యుత్‌ స్తంభాన్ని

బైక్‌ ఢీకొని..

యువకుడు మృతి, మరొకరి పరిస్థితి విషమం

ఇల్లెందురూరల్‌: విద్యుత్‌ స్తంభాన్ని బైక్‌ ఢీకొని ఓ యువకుడు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మండలంలోని ఇల్లెందులపాడు చెరువు కట్ట సమీపంలో సోమవారం రాత్రి జరిగింది. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం ముత్యాలగూడెం గ్రామానికి చెందిన వీరబోయిన సాగర్‌ (23), శేరిపురం గ్రామానికి చెందిన వట్టం కొండల్‌రావు, రాజు బైక్‌పై ఇల్లెందు మండలంలోని ఏడుబావుల జలపాతం వద్దకు వెళ్లారు. సరదాగా గడిపి రాత్రి తిరిగి వస్తుండగా చెరువు కట్ట వద్ద మూలమలుపులో విద్యుత్తు స్తంభాన్ని ఢీకొన్నారు. దీంతో తీవ్రగాయాలై సాగర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. కొండల్‌రావుకు కూడా తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఖమ్మం తరలించారు. రాజు ప్రమా దం నుంచి క్షేమంగా బయటపడ్డాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

కిసాన్‌ కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలి
1
1/3

కిసాన్‌ కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలి

కిసాన్‌ కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలి
2
2/3

కిసాన్‌ కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలి

కిసాన్‌ కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలి
3
3/3

కిసాన్‌ కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement