
ఫిర్యాదులు పరిష్కరించండి
ఖమ్మం సహకారనగర్: ప్రజలు ఇచ్చే ఫిర్యాదును పరిశీలించి వీలైనంత త్వరగా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి సూచించారు. కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణిలో భాగంగా ఆయన ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమావేశమై పరిష్కారంపై సూచనలు చేశారు.
క్యూ కడుతున్నారు...
ప్రతీ వారం కలెక్టర్‌లో నిర్వహించే ప్రజావాణికి జనం తాకిడి పెరుగుతోంది. అయితే, ఎవరికి వారే ముందు ఫిర్యాదు ఇవ్వాలనే భావనతో గుంపులుగా చేరి అధికార యంత్రాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. సోమవారం కూడా ఇదే పరిస్థితి ఎదురుకాగా పోలీస్ సిబ్బంది చేరుకుని అంతా క్యూలో వచ్చేలా నియంత్రించారు.
అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి

ఫిర్యాదులు పరిష్కరించండి