
ఫుట్‌బాల్ టోర్నీలో రన్నరప్‌గా జిల్లా జట్టు
ఖమ్మం స్పోర్ట్స్: ఆదిలాబాద్ జిల్లా రామకృష్ణాపూర్‌లో జరిగిన రాష్ట్రస్థాయి బాలికల జూని యర్ ఫుట్‌బాల్ టోర్నీలో ఉమ్మడి జిల్లా జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్స్‌లో నిజామాబాద్ జట్టుతో తలపడగా, హోరా హోరీగా సాగిన మ్యాచ్‌లో జిల్లా జట్టు రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాగా, జట్టు నుంచి శ్వేత ఉత్తమ క్రీడాకారిణిగా ఎంపికై ంది. ఈమేరకు క్రీడాకారులను ఫుట్‌బాల్ అసోసియేషన్ జిల్లా కార్య దర్శి కె.ఆదర్శ్‌కుమార్‌తో పాటు రమణ, కిషోర్, కోచ్‌లు నోయల్ జాక్సన్, మాధురి అభినందించారు.