
యూటీ వద్ద హైరానా..
కూసుమంచి: మండలంలోని పాలేరు రిజర్వాయర్ సమీపాన ఔట్‌ఫాల్ కెనాల్(ఎడమ కాల్వ) యూటీ గత ఏడాది వరదలతో కొట్టుకుపోగా కొత్త నిర్మాణం చేపడుతున్నారు. ఈమేరకు కాల్వను అడ్డంగా తవ్వి రెండు వైపులా మట్టితో కట్టలు వేసి పనులు చేపట్టారు. అయితే, పాలేరు రిజర్వాయర్‌కు సాగర్ జలాలు చేరుతుండడంతో నీటి మట్టం పెరిగి ఔట్‌ఫాల్ కెనాల్ గేట్ల నుండి నీరు లీకేజీ అయి కాల్వలోకి చేరుతోంది. ఈమేరకు యూటీ వద్ద వేసిన అడ్డుకట్ట వరకు నిండడం, శుక్రవారం ఉదయానికి కాల్వ తెగిపోయే పరిస్థితి ఎదురుకావడంతో అధికారులు ఆందోళనకు గురయ్యారు. కాగా, యూటీ వద్ద కాల్వ అడుగు భాగం వరకు స్లాబ్ పూర్తయినందున అక్కడి నుంచి నీటిని మళ్లించేలా ఇరువైపులా మట్టి కట్టలు పోసి రోలింగ్ చేయించడమే కాక మట్టి కొట్టుకుపోకుండా పాలిథిన్ షీట్లు వేయించారు. ఎస్‌ఈ మంగళంపూడి వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో ఉదయం నుంచి సాయంత్రం పనులు జరిగాయి. అయితే, ఔట్‌ఫాల్ కెనాల్ గేట్ల వద్ద లీకేజీల మరమ్మతులపై దృష్టి సారించకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైందని తెలుస్తోంది.
సాగర్ నుండి నిలిచిన నీటి సరఫరా
తాగునీటి అవసరాల నిమిత్తం సాగర్ ప్రాజెక్టు నుంచి పాలేరు రిజర్వాయర్‌కు గత ఆదివారం నుండి నీరు విడుదల చేస్తున్నారు. దీంతో శుక్రవారం సాయంత్రానికి రిజర్వాయర్ 19.40 అడుగులకు చేరింది. అయితే, గురువారం రాత్రి సాగర్ నుండి నీటి సరఫరా నిలిపివేసినా కాలువలో 1,500 క్యూసెక్కుల మేర నీరు ఉండడంతో అది చేరితే రిజర్వాయర్ శనివారం 20 అడుగులకు చేరనుంది.
పాలేరు రిజర్వాయర్ ఔట్‌ఫాల్ గేట్ల లీకేజీతో కాల్వలోకి నీరు
యుద్ధప్రాతిపదికన
కట్టలు వేసి మళ్లింపు

యూటీ వద్ద హైరానా..

యూటీ వద్ద హైరానా..