
నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ డ్రైవర్
మధిర: ప్రయాణికుడు మరిచిపోయిన రూ.10లక్షల విలువైన సామగ్రి కలిగిన బ్యాగ్‌ను తిరిగి అప్పగించి మధిర ఆర్టీసీ డిపో బస్ డ్రైవర్ నిజాయితీ చాటుకున్నాడు. బీహెచ్‌ఈఎల్ నుంచి మధిరకు వస్తున్న సూపర్ లగ్జరీ బస్సులో బోనకల్ మండలం నారా యణపురానికి చెందిన సీహెచ్.హనుమంతరావు జేఎన్‌టీయూ వద్ద ఎక్కాడు. బోనకల్ క్రాస్ వద్ద ఆయన బ్యాగ్ మర్చిపోయి దిగాడు. డిపోకు వెళ్లాక బ్యాగ్‌ను గుర్తించిన డ్రైవర్ ఎ.వెంకటేశ్వర్లు అందులో పరిశీలించగా రూ.2వేల నగదుతో పాటు రూ. 10లక్షల విలువైన బంగారు నెక్లెస్, గొలుసు, చెవి దిద్దులు, ఫోన్ ఉన్నాయి. సదరు ప్రయాణికుడికి సమాచారం ఇచ్చి బ్యాగ్‌ను ట్రాఫిక్ ఇన్‌చార్జ్ వెంకటేశ్వర్లు, కంట్రోలర్ కాలేషా సమక్షాన అందజేశా రు. ఈసందర్భంగా డ్రైవర్ వెంకటేశ్వర్లుతో పాటు డీఎం డి.శంకర్‌రావు, ఉద్యోగులకు హనుమంతరావు కృతజ్ఞతలు తెలిపారు.