
పాలిసెట్‌లో త్రివేణి విద్యార్థులకు ర్యాంకులు
పాలీసెట్ ఫలితాల్లో ఖమ్మం త్రివేణి పాఠశాల విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని డైరెక్టర్ డాక్టర్ గొల్లపూడి వీరేంద్ర చౌదరి తెలిపారు. ఈమేరకు శనివారం ఆయన విద్యార్థులను అభినందించి మాట్లాడారు. పాఠశాల విద్యార్థి సరయు 120మార్కులకు గాను 109 మార్కులతో రాష్ట్రస్థాయి 187వ ర్యాంక్ సాధించగా, ప్రణవి 106 మార్కులతో 339వ ర్యాంక్, వెంకట వర్షిత్ 107 మార్కులతో 481, చరిత 103 మార్కులతో 529వ ర్యాంకు సాధించగా, శాహిస్త 1,340, మాన్హైత 1,357, హమ్సికా 1,823వ ర్యాంకు సాధించారని పేర్కొన్నారు. ఈమేరకు విద్యార్థులను డైరెక్టర్ గొల్ల పూడి వీరేంద్ర చౌదరి, కృష్ణవేణి – త్రివేణి విద్యాసంస్థల డైరెక్టర్ యార్లగడ్డ వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్, కాట్రగడ్డ మురళీకృష్ణతో పాటు స్వప్న, ముస్తఫా, అశోక్, చార్లెస్, సందీప్, ఉపాధ్యాయులు అభినందించారు.