
అంగన్‌వాడీ లబ్ధిదారులకు సరుకుల పంపిణీ
నేలకొండపల్లి: ఎండల తీవ్రత నేపథ్యాన అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ప్రకటించారు. గతంలోనూ సెలవులు ప్రకటించినప్పటికీ నెలలో వంతుల వారీగా టీచర్, ఆయా విధులు నిర్వర్తిస్తూ లబ్ధిదారులకు పోషకాహారం వండి వడ్డించేవారు. ఈసారి అందుకు భిన్నంగా నెలకు సరిపడా సరుకులు పంపిణీ(టేక్ హోం రేషన్) చేయాలని ప్రభు త్వం ఆదేశించింది. దీంతో చిన్నారులకు కోడిగుడ్లు, బాలామృతం, బాలింతలు, గర్భిణులకు బియ్యం, పప్పు, నూనెతో పాటు పాలు, గుడ్లు అందిస్తున్నా రు. జిల్లాలోని ఏడు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1,840 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధి లో ఆరునెలల నుంచి ఆరేళ్ల వరకు పిల్లలు 54,712 మంది, గర్భిణులు, బాలింతలు 12,715 మంది ఉండగా, సూపర్‌వైజర్ల పర్యవేక్షణలో సరు కులు అందిస్తున్నామని జిల్లా సంక్షేమాధికారి రాంగోపాల్‌రెడ్డి తెలిపారు.