సాగర్ కాల్వ మరమ్మతులు ప్రారంభం
కూసుమంచి: గత ఏడాది సెప్టెంబర్‌లో వచ్చిన వరదతో పాలేరు రిజర్వాయర్ నుండి జిల్లాలోని ఆయకట్టుకు నీరందించే ఎడమ కాల్వకు భారీ గండ్లు పడ్డాయి. అంతేకాక పలుచోట్ల కోతకు గురికాగా, అప్పటికప్పుడు యూటీ ప్రాంతంలో పడిన గండిని పూడ్చివేసి ఆయకట్టుకు నీరు సరఫరా చేశారు. అలాగే, మత్స్య పరిశోధనా కేంద్రం సమీపాన కాల్వ కట్ట కూడా భారీగా కోతకు గురవడంతో తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టారు. ప్రస్తుతం పంటల సీజన్ ముగియడంతో కాల్వకు నీటి సరఫరా నిలివేసిన నేపథ్యాన కోతకు గురైన చోట్ల పూర్తిస్థాయి మరమ్మతులను మంగళవారం ప్రారంభించారు. వానాకాలం సీజన్ నాటికి పనులన్నీ పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు.
మినీ హైడల్ ప్రాజెక్టుకు కూడా..
పాలేరు రిజర్వాయర్ ఆధారంగా కొనసాగుతున్న మినీ హైడల్ ప్రాజెక్టుకు నీందందించే కాల్వకు సైతం అప్పట్లో గండి పడగా తాత్కాతిక మరమ్మతులు చేపట్టారు. ప్రస్తుతం కాల్వ కట్టలను పటిష్టపర్చడంతో పాటు విద్యుత్ ఉత్పత్తి చేసే యూనిట్ల మరమ్మతులను జెన్‌కో నిధులతో ప్రారంభించారు.


