
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
నేలకొండపల్లి: రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన మండలంలో చోటుచేసుకుంది. ఏపీలోని విజయవాడకు చెందిన షేక్ రజాక్ (35) హైదరాబాద్ వెళ్లి బైక్‌పై తిరిగి స్వస్థలాలకు పయనమయ్యాడు. ఖమ్మం నుంచి కోదాడ మీదుగా విజయవాడ వెళ్తుండగా నేలకొండపల్లి మండలం గువ్వలగూడెం సమీపంలో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. నేషనల్ హైవే పెట్రోలింగ్ వాహనం సిబ్బంది ఆయనను నేలకొండపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనపై రజాక్ సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
చికిత్స పొందుతున్న బీటెక్ విద్యార్థి...
పెనుబల్లి: మండలంలోని లంకపల్లి శివారులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బీటెక్ విద్యార్థి రావిలాల పవన్‌సాయి (18) ఖమ్మంలో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మండాలపాడుకు చెందిన పవన్ సాయి తన సోదరిని స్కూల్ బస్సు ఎక్కించి వస్తుండగా మార్గమధ్యలో లంకపల్లి శివారు వద్ద డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆయన్ను ఖమ్మం ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ కన్నుమూశాడు.