చదువుతోనే మహిళా సాధికారత
ఖమ్మం మయూరిసెంటర్(ఖమ్మం మామిళ్లగూడెం): ఉన్నత చదువులతోనే మహిళా సాధికారత సాధ్యమవుతుందని ప్రజాకవి జయరాజు అన్నారు. వీరనారిమణుల ఆశయ సాధన సమితి ఆధ్వర్యాన అంబేడ్కర్ వర్ధంతి సందర్బంగా ఖమ్మంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో శుక్రవారం రాజ్యాధికారం, మహిళా రిజర్వేషన్ల అంశంపై నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. అంబేడ్కర్ స్ఫూర్తితో మహిళలు ఉన్నత చదువు కోసం అడుగు ముందుకు వేయాలని సూచించారు. అనంతరం డాక్టర్ గ్రీష్మ, ఫరహ, షేక్ నజీమాతో పాటు భూక్యా ఉపేంద్రాబాయి, జ్యోతి తదితరులు మాట్లాడగా వివిధ సంఘాల నాయకులు బానోతు భద్రూనాయక్, రాణి, నాగయ్య, జ్యోతి, జాన్‌బీ, త్రివేణి, చందు, విజయ, లలిత, సుభద్ర, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. కాగా, తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
జాబ్‌మేళాకు 52 మంది హాజరు
ఖమ్మం రాపర్తినగర్: ఖమ్మం టేకులపల్లిలోని మోడల్ కెరీర్ సెంటర్‌లో శుక్రవారం నిర్వహించిన జాబ్‌మేళాకు 52మంది హాజరయ్యారు. మెడ్‌ప్లస్ సంస్థలో ఫార్మసిస్టులు, ఇతర ఉద్యోగాలకు ఎంపికకు జాబ్‌మేళా నిర్వహించగా 21మందిని ఇంటర్వ్యూకు ఎంపిక చేశారు. ఆపై వడపోతల అనంతరం 12మందిని అర్హులుగా గుర్తించి నియామక పత్రాలు అందజేశారు. జాబ్ మేళాలో జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి ఎన్.మాధవి, ఉద్యోగి శ్రీనివాసరావుతో పాటు కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
రూ.1.5 కోట్ల విలువైన ట్రాన్స్‌ఫార్మర్, ఫీడర్ల ఏర్పాటు
ఏన్కూరు: మండలంలోని జన్నారం సబ్‌స్టేషన్‌లో అదనంగా రూ.కోటిన్నర విలువైన ట్రాన్స్‌ఫార్మర్, రెండు ఫీడర్లు ఏర్పాటు చేసినట్లు డీఈ ఎల్.రాములు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ట్రాన్స్‌ఫార్మర్‌ను ప్రారంభించి మాట్లాడారు. లో ఓల్టేజీ సమస్య నివారణకు అదనపు ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటుచేయగా ఇకపై వ్యవసాయ మోటార్లకు సమస్య తలెత్తద్దని చెప్పారు. డీఈ భద్రు, ఏడీఈ రమేష్, ఏఈఓ సతీష్, ఏఈ ఉమకాంత్ పాల్గొన్నారు.
వేతనాలు చెల్లించాలని ధర్నా
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికుల కు మూడు నెలల జీతాలు చెల్లించాలని సీఐటీ యూ, టీయూసీఐ నాయకులు డిమాండ్ చేశా రు. ఈ సందర్భంగా శుక్రవారం ఆస్పత్రి ఆవరణలో కార్మికులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు తుమ్మ విష్ణువర్ధన్, టీయూసీఐ జిల్లా కార్యదర్శి జి.రామయ్య మాట్లాడుతూ చాలీచాలని వేతంతో పనిచేస్తున్న కార్మికులకు మూడు నెలలుగా జీతా లు అందకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందన్నారు. అటు కాంట్రాక్టర్, ఇటు అధి కారుల తీరుతో సమస్య నెలకొందని, ఇకనైనా జీ తాలు చెల్లించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించచారు. నాయకులు వై.విక్రం, కె.శ్రీనివాస్, విజయమ్మ ,వెంకటరమణ, అశోక్, అంబేద్కర్, ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఆలిండియా బాల్‌బ్యాడ్మింటన్ టోర్నీకి ఎంపిక
బోనకల్: ఆలిండి యా బాల్‌బ్యాడ్మింటన్ ఫెడరేషన్ కప్ టోర్నీకి ఖమ్మం జిల్లా బోనకల్‌కు చెందిన బి.గోపి ఎంపికయ్యాడు. మూడు రోజుల పాటు హైదరాబాద్‌లో జరిగిన శిక్షణలో పాల్గొన్న ఆయన ప్రతిభ కనబరచడంతో టోర్నీకి ఎంపిక చేశారు. కర్ణాటకలో జరుగుతున్న పోటీలకు గోపి బయలుదేరాడని బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాంచందర్‌రాజు, శ్రీనివాసరావు, కోచ్ లింగయ్య తెలిపారు.
షాద్‌నగర్ ఎమ్మెల్యేపై ఫిర్యాదు
ఖమ్మంక్రైం: పద్మనాయక వెలమ సామాజికవర్గాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌పై ఖమ్మం టూటౌన్ పో లీస్‌స్టేషన్‌లో వెలమ సంఘం నాయకులు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఒక ప్రజాప్రతినిధిగా తమ సామాజిక వర్గాన్ని అసభ్య పదజాలంతో దూషించడమే కాక వెలమ కులస్తుల అంతు చూస్తామని బెదిరించాడని పేర్కొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సాగి వెంకటేశ్వరరావు, సీతారామారావు, నాయకులు వెంకటేశ్వరరావు సురేష్‌బాబు, సురేందర్‌రావు, సుధాకర్‌రావు ఫిర్యాదు అందజేశారు.
జర్నలిస్టుగా చెప్పుకుంటూ ఇసుక దందా
తిరుమలాయపాలెం: మండలంలోని ముజాహిదిపురానికి చెందిన పి.ప్రభాకర్ జర్నలిస్టుగా చెప్పుకుంటూ ఇసుక అక్రమ వ్యాపారం చేస్తుండగా శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. ఆయన జర్నలిస్టునని చెప్పడమే కాక పోలీసులంతా తెలుసునని ట్రాక్టర్ డ్రైవర్లను బెదిరించి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈమేరకు ప్రభాకర్‌ను అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ కూచిపూడి జగదీష్ తెలిపారు.
చదువుతోనే మహిళా సాధికారత


