
చిన్నకోరుకొండిలో డప్పు కొడుతున్న సండ్ర
కల్లూరురూరల్: కాంగ్రెస్ నేతల మాయమాటలు నమ్మి మోసపోవద్దని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కోరారు. కల్లూరు మండలంలోని పలు గ్రామాల్లో రూ.11 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆదివారం ఆయన శంకుస్థాపన చేసి, చిన్నకోరుకొండిలో ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. ఆరు గ్యారంటీ పథకాలంటూ ప్రజలను కాంగ్రెస్ నాయకులు మభ్య పెడుతున్నార ని అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి సీఎం కేసీఆర్ దళితబంధు మంజూరు చేశారని, భవిష్యత్‌లో అన్ని వర్గాల అభివృద్ధికి ఇలాంటి పథకాలను అమలు చేస్తామని తెలిపారు. కార్యక్రమాల్లో అధికారులు, నాయకులు రవికుమార్, ఎం.రూ ప, సౌజన్య, ఆర్.రాంబాబు, నామా రాధమ్మ, చావా వెంకటేశ్వరరావు, తోట కనకారావు, భీరవల్లి రఘు, కట్టా అజయ్‌కుమార్, పాలెపు రామారావు, లక్ష్మీకాంతమ్మ, లక్ష్మణ్‌రావు, ఇస్మాయిల్ పాల్గొన్నారు.