
మాట్లాడుతున్న ఎంపీ నామా నాగేశ్వరరావు
కారేపల్లి: సమన్వయంతో పనిచేసి మదన్‌లాల్‌ను గెలిపించుకుందామని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం కారేపల్లి వైఎస్‌ఎన్ గార్డెన్స్‌లో బీఆర్‌ఎస్ మండల సమావేశాన్ని నిర్వహించగా ఎంపీ హాజరై మాట్లాడారు. ఎన్నికలను తేలికగా తీసుకోవద్దని, 6 గ్యారంటీల పేరుతో ఊదరగొడుతున్నారని, వారి మాటలను నమ్మొద్దని సూచించారు. కేసీఆర్ నేతృత్వలో రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో ఎక్కడా లేవని తెలిపారు. ఏ సమస్య ఉన్నా తనకు చెబితే పరిష్కరిస్తానని, మదన్‌లాల్‌ను గెలిపిస్తే కేసీఆర్‌ను గెలిపించినట్లేనని ఎంపీ పేర్కొన్నారు.
టికెట్ రాలేదని బాధ లేదు..
కేసీఆర్ అంటే తనకు ఇష్టమని, టికెట్ రాలేదని బాధ లేదని ఎమ్మెల్యే రాములునాయక్ స్పష్టం చేశారు. కేసీఆర్ దిశానిర్దేశం మేరకు మదన్‌లాల్‌ను గెలిపించుకోవాలన్నారు. ఎన్నికల శంఖారావం మోగిందని, అందరూ సైనికుల్లా పని చేయాలని కోరారు. తొలుత కారేపల్లి అంబేడ్కర్ సెంటర్‌లో బానోత్ మదన్‌లాల్, నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే రాములునాయక్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో నల్లమల వెంకటేశ్వర్లు, వాంకుడోతు జగన్, పెద్దబోయిన ఉమాశంకర్, రావూరి శ్రీనివాసరావు, దుగ్గినేని శ్రీనివాసరావు, మంగీలాల్, అడ్డగోడ ఐలయ్య, ముత్యాల సత్యనారాయణ, ఉన్నం వీరేందర్, తోటకూరి పిచ్చయ్య, తోటకూరి రాంబాబు, నర్సింగ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ నామా నాగేశ్వరరావు