
సమావేశంలో మాట్లాడుతున్న డైరెక్టర్ బలరామ్
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కార్మికులకు మెరుగైన వైద్యం అందేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని డైరెక్టర్ ఎన్.బలరామ్ సూచించారు. కొత్తగూడెంలోని ప్రధాన ఆస్పత్రిలో శనివారం ఆయన సింగరేణి చీఫ్ మెడికల్ ఆపీసర్ (సీఎంఓ)తో పాటు అన్ని ఏరియాల డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్లతో సమవేశమయ్యారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ.. కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలనేదే సంస్థ లక్ష్యమని తెలిపారు. ఇప్పటికే ఆస్పత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పించగా, వైద్యనిపుణులను కూడా నియమించామని చెప్పారు. ఈ మేరకు అధికారులు ప్రత్యేక దృష్టి సారించి కావాల్సిన మందులను సమకూర్చుకోవడమే కాక వైద్యులు సమయపాలన పాటించేలా చూడాలని సూచించారు. సమావేశంలో సీఎంఓ పి.సుజాత, ఏసీఎంఓ విక్టర్ వందనం, డీవైసీఎంఓలు సునీల, పద్మజ, కిరణ్‌రాజ్‌కుమార్, ఉషారాణి, ఎం.కుమారి, పి.రమేశ్‌బాబు, కె.బాలకోటయ్య, మల్లారెడ్డి, సీనియర్ పీఓ మండల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
వృక్షాలతో మానవాళికి మేలు
మణుగూరుటౌన్: పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు మానవాళి మనుగడలో మొక్కలు కీలకపాత్ర పోషిస్తాయని సింగరేణి డైరెక్టర్ బలరామ్ తెలిపారు. మణుగూరు ఏరియాలో శనివారం పర్యటించిన ఆయన ఓసీలో మొక్కలు నాటి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న హరితహారంలో భాగంగా ప్రతీఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. అనంతరం జీఎం దుర్గం రాంచందర్ మాట్లాడగా, అధికారులు, నాయకులు వీసం కృష్ణయ్య, డి.వెంకటేశ్వర్లు, నర్సిరెడ్డి, రవీందర్, వి.ప్రభాకర్‌రావు, రాంగోపాల్, జాన్, ప్రసాద్, కొడిపల్లి శ్రీలత, భుక్యా కిషన్, షబ్బీర్‌అలీ తదితరులు పాల్గొన్నారు.
సమీక్ష సమావేశంలో సింగరేణి డైరెక్టర్
బలరామ్