ముగిసిన ఉత్సవ విగ్రహాల వివాదం

బోనకల్: మండలంలోని ఆళ్లపాడులో శ్రీసీతారాముల ఉత్సవ విగ్రహాల ఊరేగింపు విషయంలో రెండు వర్గాల నడుమ నెలకొన్న ఉద్రిక్తత శుక్రవారం చల్లారింది. కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యాన గురువారం కల్యాణం నిర్వహించాక ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా రామాలయానికి తీసుకొచ్చేసరికి తాళం వేసి ఉండడంతో బయటే పెట్టారు. ఈక్రమంలో ఎస్‌ఐ తేజావత్ కవిత శుక్రవారం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులను పిలిపించి సయోధ్య కుదిరించడంతో వివాదం ముగిసింది. దీంతో కాంగ్రెస్ నేతలు కల్యాణం జరిపించిన ఉత్సవ విగ్రహాలను కూడా రామాలయంలో పెట్టారు.