
మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఉపేందర్‌రెడ్డి
కూసుమంచి: రానున్న ఎన్నికల్లో పాలేరు నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా తానే పోటీ చేస్తానని.. గెలుపు కూడా తనదేనని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి వెల్లడించారు. కూసుమంచిలో శనివారం పాలేరు నియోజకవర్గ స్థాయి పాస్టర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ఇటీవల జనచైతన్య యాత్రలో సీపీఎం నాయకులు పాలేరు టికెట్ అడుగుతున్నాం అని చెప్పారు.. కానీ మీరందరూ ఒకటి గుర్తు పెట్టుకోవా లి.. కమ్యూనిస్టులకు ఓట్లువేసే రోజులు పోయాయి.. నిజమేనా, కాదా?’ అంటూ సభలోని వారిని ఎమ్మె ల్యే ప్రశ్నించారు. ఏదిఏమైనా పాలేరు నుంచే తానే పోటీ చేసి విజయం సాధిస్తానని తెలిపారు. ‘ప్రజల కు మేలు చేస్తున్నాననుకుంటే నన్ను గెలిపించాలి, ఇంకా ఎవరైనా మేలు చేస్తారనుకుంటే వారినే గెలిపించండి’ అంటూ వ్యాఖ్యానించారు. కాగా, శుక్రవారం కూసుమంచిలో సీపీఎం చేపట్టిన జనచైతన్య యాత్రలో పాల్గొన్న ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పాలేరు స్థానం తమకు ప్రాధాన్యమైనదని చెప్పగా.. ఆ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే మరుసటి రోజే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి