ఈడీ దాడులు తగదు | - | Sakshi
Sakshi News home page

ఈడీ దాడులు తగదు

Jun 4 2026 5:04 AM | Updated on Jun 4 2026 5:04 AM

హొసపేటె: కేరళ మాజీ ముఖ్యమంత్రి, సీపీఐ(ఎం) పొలిట్‌ బ్యూరో సభ్యుడు పినరయి విజయన్‌ నివాసంపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు జరిపిన దాడిని తాలూకా కమిటీ తీవ్రంగా నిరసించింది. పార్టీ నేత ఖలందర్‌ మాట్లాడుతూ ఎక్స్‌లాజిక్‌ కేసుతో పినరయి విజయన్‌కు ఎలాంటి సంబంధం లేదని కోర్టు చెప్పినా ఆయనపై రాజకీయ వేట కొనసాగుతోందన్నారు. కేవలం వీణా తండ్రి అయినందుకే ఆయనను లక్ష్యంగా చేసుకుంటున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం రోజురోజుకు పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పెంచుతూ నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు, నిరుద్యోగులు, రైతులు, కార్మికులు, ప్రజల దుస్థితికి దారితీస్తూ సామాన్యుడి ప్రాథమిక సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటి దాడుల ద్వారా ప్రయత్నిస్తోందన్నారు. కర్ణాటక ప్రాంత రైతు సంఘం జిల్లా కార్యదర్శి జీ.పంపనగౌడ, రైతు సంఘం తాలూకా కార్యదర్శి వీ.దేవన్న, సీడబ్ల్యూఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు, రైతు సంఘ సభ్యురాలు మరి దురుగమ్మ, దేవదాసి మహిళా సంఘం తాలూకా కార్యదర్శి త్రివేణి, ఒంటరి మహిళా సంఘం తాలూకా కార్యదర్శి, దేవదాసీ మహిళా సంఘం తాలూకా ఉపాధ్యాక్షురాలు హులిగెమ్మ, భారతి జీ.వసంత్‌, వీ.తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement