మందులు బందయితే.. | - | Sakshi
Sakshi News home page

మందులు బందయితే..

May 21 2026 4:51 AM | Updated on May 21 2026 4:51 AM

శివాజీనగర: చిన్న సుస్తీ చేసినా మందుల అంగడికి వెళ్లి మాత్ర తీసుకుని ఉపశమనం పొందడం సామాన్యులకు అలవాటే. కానీ హఠాత్తుగా షాపులు మూతపడడంతో ఇబ్బందులు పడ్డారు. మెడికల్‌ స్టోర్‌ల బంద్‌కు రాష్ట్రంలో మిశ్రమ స్పందన వ్యక్తమైంది. రాష్ట్రంలో సుమారు 26 వేలు, బెంగళూరులో సుమారు 6,500లకు పైగా మందుల షాపులు ఉండగా, ఎక్కువశాతం యజమానులు బుధవారం సమ్మెలో పాల్గొన్నారు. కొన్నిచోట్ల మాత్రం తెరిచే ఉన్నాయి. ఆన్‌లైన్‌లో మందుల అమ్మకాలను బంద్‌ చేయాలని, ఇంకా పలు డిమాండ్లతో సమ్మె నిర్వహించారు. బంద్‌ నేపథ్యంలో పలు చోట్ల ప్రజలు షాపుల కోసం గాలించారు.

కేంద్రం పరిష్కరించాలి

తుమకూరు: ఔషధ వ్యాపారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. తుమకూరు నగరంతో పాటు జిల్లావ్యాప్తంగా ఔషధ వ్యాపారులు అంగళ్లను మూసివేసి నిరసనలో పాల్గొన్నారు. మెడ్‌ప్లస్‌, అపోలో వంటి షాపులు పనిచేశాయి. ఔషధాల కోసం తెరిచి ఉన్న షాపులకు ప్రజలు ఎక్కువగా రావడంతో రద్దీ ఏర్పడింది.

బెంగళూరు సహా రాష్ట్రంలో మెడికల్‌ షాపుల యజమానుల సమ్మె

Advertisement
 
Advertisement
Advertisement