ఆగస్టు 31లోగా బెంగళూరు పాలికేలకు ఎన్నికలు | - | Sakshi
Sakshi News home page

ఆగస్టు 31లోగా బెంగళూరు పాలికేలకు ఎన్నికలు

May 21 2026 4:51 AM | Updated on May 21 2026 4:51 AM

బనశంకరి: గ్రేటర్‌ బెంగళూరు ప్రాధికార (జీబీఏ) పరిధిలోని 5 నగర పాలికేలకు ఆగస్టు 31లోగా కచ్చితంగా ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదే చివరి గడువు అని, ఇకపై పొడిగించేదిలేదని స్పష్టం చేసింది. దీంతో గతంలో ఇచ్చిన జూన్‌ 30 గడువు 2 నెలలు పొడిగించినట్లయింది. జనాభా లెక్కల సేకరణ, ఓటర్ల జాబితా ప్రత్యేక పరిష్కారం వంటి కార్యక్రమాల వల్ల సిబ్బంది కొరత ఉందని రాష్ట్ర ప్రభుత్వం సూచన మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసింది.

త్రిసభ్య ధర్మాసనం విచారణ

బుధవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌, న్యాయమూర్తులు జాయ్‌ మల్య బాగ్చి, విపుల్‌ పంచోలి ధర్మాసనం విచారణ జరిపింది. ఈసీ అభ్యర్థనను ఆమోదిస్తూ, గ్రేటర్‌ బెంగళూరు ఎన్నికలకు ఆగస్టు 31 వరకు గడువు ఇచ్చింది. సెప్టెంబరు చివరి వరకు సమయం కావాలనగా తిరస్కరించింది. ఇకపై ఎన్నికల వాయిదాకు అనుమతి ఇచ్చేది లేదని జడ్జిలు స్పష్టం చేశారు. 2 నెలల సమయం సరిపోతుందని పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు బెంగళూరు పాలికేలకు ఎన్నికలు జరిపే బాధ్యత సర్కారు ముందుంది.

సుప్రీంకోర్టు ఆదేశం

Advertisement
 
Advertisement
Advertisement