87కు బదులు 47 మార్కులు | - | Sakshi
Sakshi News home page

87కు బదులు 47 మార్కులు

Apr 28 2026 7:59 AM | Updated on Apr 28 2026 7:59 AM

తుమకూరు: పగలూ రాత్రీ కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకున్న ఒక పేద విద్యార్థిని కలలపై మూల్యాంకనం పొరపాటు నీళ్లు చల్లింది. చిక్కనాయకనహళ్లి తాలూకా, మేలనహళ్లిలోని కిత్తూరు రాణి చెన్నమ్మ రెసిడెన్షియల్‌ స్కూల్‌ విద్యార్థిని కె.అంకిత మూల్యాంకనంలో మాస్టార్ల పొరపాటు వల్ల అన్యాయానికి గురైంది. అంకిత తండ్రి గతంలో మరణించాడు, తల్లి గార్మెంట్స్‌లో పనిచేస్తూ చదివిస్తోంది. ఇటీవల విడుదలైన ఎస్‌ఎస్‌ఎల్‌సీ ఫలితాలలో అంకితకు కన్నడలో 47 మార్కులు వచ్చాయి.

అనుమానంతో తనిఖీ చేయగా

ఆమె కన్నడలో ఎంతో ప్రావీణ్యం ఉన్న విద్యార్థిని, పరీక్ష కూడా బాగా రాసింది. దీంతో అనుమానం వచ్చి ఆమె పాఠశాల ఉపాధ్యాయులు, మార్కుల షీటును పరిశీలించారు. అందులో తేడా కనిపించింది. అన్ని సమాధానాలకు వచ్చిన మార్కులను కలిపితే, మొత్తం 87 మార్కులు ఉన్నాయి, కానీ మూల్యాంకనం చేసిన మాస్టారు ఎవరో కానీ 47 అని నమోదు చేశారు. ఈ పొరపాటు వల్ల తన కూతురికి అన్యాయం జరిగిందని, సరిచేయాలని తల్లి లలితమ్మ కోరింది. తప్పు చేసినవారికి శిక్ష పడాలని డిమాండ్‌ చేసింది.

టెన్త్‌ విద్యార్థినికి అన్యాయం

మూల్యాంకనంలో పొరపాటు

Advertisement
 
Advertisement
Advertisement