అన్నీ ఆలోచించే.. నజీర్‌ తొలగింపు | - | Sakshi
Sakshi News home page

అన్నీ ఆలోచించే.. నజీర్‌ తొలగింపు

Apr 15 2026 8:02 AM | Updated on Apr 15 2026 8:02 AM

బనశంకరి: సీఎం సిద్దరామయ్య వివిధ మూలాల నుంచి సమాచారం సేకరించి పార్టీ హితం కోసం నజీర్‌ అహ్మద్‌ విషయంలో నిర్ణయం తీసుకున్నారని డీసీఎం డీకే.శివకుమార్‌ అన్నారు. కేపీసీసీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రాజకీయ కార్యదర్శి పదవి నుంచి నజీర్‌ అహ్మద్‌ను తొలగిస్తూ సీఎం ఆదేశాలిచ్చారని తెలిపారు. ‘నజీర్‌ అహ్మద్‌కు దావణగెరె దక్షిణకు వెళ్లి రెబెల్‌ అభ్యర్థిని తప్పించేలా చూడాలని పార్టీ సూచించింది. కానీ అతను బాధ్యత నిర్వర్తించలేకపోయారు. అక్కడ ఏం జరిగిందనేది నాకు నివేదిక అందాలి’ అని డీకే చెప్పారు. ఏ పార్టీలో అయినా క్రమశిక్షణ ముఖ్యం, అందరితో చర్చించే అక్కడ అభ్యర్థిని ఎంపిక చేసినట్లు తెలిపారు. అందరితో ఎన్నికల గురించి చర్చించడం పార్టీ అధ్యక్షునిగా నా కర్తవ్యమన్నారు. ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి మంత్రి పదవి అడగటం తప్పులేదని, కానీ జాగ్రత్తగాను, క్రమశిక్షణగా ఉండాలని సూచించారు.

డీసీఎం శివకుమార్‌

Advertisement
 
Advertisement
Advertisement