● రాష్ట్రమంతటా వైభవంగా
జయంతి సంబరాలు
శివాజీనగర: భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్.అంబేడ్కర్ 135వ జయంతిని రాష్ట్రమంతటా వైభవంగా ఆచరించారు. అంబేడ్కర్ నిలువెత్తు రూపాలతో భారీ ఊరేగింపులు జరిగాయి. బెంగళూరులో విధానసౌధ ముందున్న అంబేద్కర్ విగ్రహానికి సీఎం సిద్దరామయ్య నివాళులర్పించారు. పెద్దసంఖ్యలో మంత్రులు, ఎమ్మెల్యేలు, దళిత మేధావులు పాల్గొన్నారు. కేపీసీసీ, బీజేపీ, జేడీఎస్ ఆఫీసుల్లోనూ జయంతి వేడుకలు జరిగాయి.


