● చిత్రకళా పరిషత్‌లో ముగ్ధుల్ని చేసే పెయింటింగ్స్
బనశంకరి: బెంగళూరు చిత్రకళా పరిషత్‌లో బృంద చిత్రలేఖన ప్రదర్శన కళాప్రియులను అబ్బురపరుస్తోంది. పరిషత్‌లో గ్యాలరీ–2లో ఏ మెసర్ ఆఫ్ మెనీ పేరుతో బ్లిందా ఫెర్నాండేజ్ నేతృత్వంలో 20 మంది వర్ధమాన చిత్రకారుల పెయింటింగ్స్‌తో ప్రదర్శన ఏర్పాటైంది. కళాకారులు ప్రకృతి, పర్యావరణం, పల్లె జీవనం, పువ్వులు, పక్షులు, మహిళలను ఇతివృత్తంగా చేసుకుని కళాకారులు తమ మనసులోని భావాలను కుంచె ద్వారా నవ్యమైన చిత్రాలకు జీవం పోశారు. పల్లె జీవనంలో మహిళలు, జలాశయాల్లో విదేశీ పక్షులు, తామరపువ్వులు, ఆంగ్ల మహిళల చిత్రలేఖనాలు ఔరా అనిపిస్తాయి. చిత్రకారిణులు దివ్య మురళి, హెన్నా బజాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రదర్శన 19వ తేదీ వరకు జరుగుతుంది.


