కారు–టిప్పర్‌ ఢీ, తల్లీకూతురు బలి | - | Sakshi
Sakshi News home page

కారు–టిప్పర్‌ ఢీ, తల్లీకూతురు బలి

Apr 15 2026 7:56 AM | Updated on Apr 15 2026 7:56 AM

మైసూరు: టిప్పర్‌– కారు ఢీకొనడంతో తల్లీకూతుళ్లు మరణించగా, మరో చిన్నారి, కుటుంబ పెద్ద గాయపడ్డారు. ఈ ప్రమాదం మంగళవారం చామరాజనగర జిల్లాలోని గుండ్లపేట పట్టణంలో, కేరళ–మైసూరు హైవేలో మల్లయనపుర గేట్‌ వద్ద జరిగింది. టిప్పర్‌ గుండ్లుపేట నుంచి కేరళకు ఇసుకను తీసుకువెళ్తుండగా, కేరళలోని కాలికట్‌ నుంచి వస్తున్న కారు ఢీకొన్నాయి. కారులోని నిషా నూరి (37), ఆమె కుమార్తె నోవా (18) గాయాలతో చనిపోగా, నిషా భర్త మహమ్మద్‌ అజీర్‌ (41), కుమారుడు నహ్యాన్‌ (9) తీవ్రంగా గాయపడటంతో వారిని మైసూరు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు టిప్పర్‌ డ్రైవర్‌ను అరెస్టు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement