ఆగి ఉన్న లారీని బస్సు ఢీ | - | Sakshi
Sakshi News home page

ఆగి ఉన్న లారీని బస్సు ఢీ

Apr 15 2026 7:56 AM | Updated on Apr 15 2026 7:56 AM

తుమకూరు: జిల్లాలోని శిరా తాలూకాలో ద్వారలు వద్ద 48వ హైవేలో మంగళవారం ఉదయం కేఎస్‌ ఆర్టీసీ బస్సు నిలిచి ఉన్న కంటైనర్‌ లారీని ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో బస్సు డ్రైవర్‌, మరో ప్రయాణికుడు చనిపోయారు. లారీ ఏదో సమస్య వచ్చి వంతెనపై నిలిచి ఉండగా, బస్సు వేగంగా వచ్చి ఢీకొనింది, దీంతో బస్సు ముందు భాగం తుక్కయింది, బస్సు డ్రైవర్‌ శ్రీకాంత్‌ (50), గుర్తుతెలియని ప్రయాణికుడు అక్కడే మరణించారు. బస్సులోని సుమారు 33 మంది ప్రయాణికులు గాయపడ్డారు. 23 మందికి ఎక్కువ గాయాలు కావడంతో తుమకూరు జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. ముగ్గురికి చిత్రదుర్గ ఆసుపత్రిలో, ఒకరు శిర ఆసుపత్రిలో ఉన్నారు. తావరకెరె పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. ప్రమాదం వల్ల రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

బస్సు డ్రైవర్‌, మరొకరు మృతి

33 మందికి గాయాలు

తుమకూరు జిల్లాలో విషాదం

Advertisement
 
Advertisement
Advertisement