నేడు సిటీలో ఐపీఎల్‌ మ్యాచ్‌ | - | Sakshi
Sakshi News home page

నేడు సిటీలో ఐపీఎల్‌ మ్యాచ్‌

Apr 15 2026 7:56 AM | Updated on Apr 15 2026 7:56 AM

బనశంకరి: నేడు బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సీబీ – లక్నో సూపర్‌ జైంట్స్‌ జట్ల మధ్య ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో పోలీసులు పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్‌ మళ్లింపులు, పార్కింగ్‌ వసతుల మార్పు చేశారు. కబ్బన్‌ పార్కు లోపల కింగ్‌ రోడ్డు, ప్రెస్‌క్లబ్‌ ముందు, బాలభవన్‌ ముందు, ఫౌంటెన్‌ రోడ్లలో వాహనాల పార్కింగ్‌ను నిషేధించారు.

అంధ విద్యార్థి నిజాయతీ

సొంతదారుకు క్యాష్‌ బ్యాగ్‌ అప్పగింత

హొససేటె: విజయనగర జిల్లా హరపనహళ్లి తాలూకాలో ప్రయాణ సమయంలో తన వద్దకు వచ్చిన రూ.లక్ష నగదు కలిగిన ఓ బ్యాగ్‌ను ఒక అంధ విద్యార్థి పోలీసులకు అప్పగించిన ఘటన మంగళవారం జరిగింది. పోలీసులు ఆ బ్యాగ్‌ను సొంత దారుకు అప్పగించారు. వివరాలు.. దావణగెరె జిల్లా హరపనహళ్లికి వెళుతున్న మార్గంలో లెక్చరర్‌ ధనుంజయకు చెందిన రూ.లక్షల నగదు కలిగిన ఓ బ్యాగ్‌ను తెలగి గ్రామానికి చెందిన అంధ విద్యార్థి హాలేష్‌ బ్యాగ్‌తో పొరపాటున మారిపోయింది. హాలేష్‌ రూ.లక్ష ఉన్న నగదున్న ఆ బ్యాగ్‌ను హరపనహళ్లి పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు. పోలీసులు ధనుంజయను గుర్తించి అతడి డబ్బును, బ్యాగ్‌ను తిరిగి అందజేశారు. హాలేష్‌ పీయూసీ చదువుతున్నాడు. అతడు చూపించిన నిజాయితీని అందరూ అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement