నిరుద్యోగుల పోరాటానికి పోలీసుల బ్రేక్‌ | - | Sakshi
Sakshi News home page

నిరుద్యోగుల పోరాటానికి పోలీసుల బ్రేక్‌

Apr 15 2026 7:56 AM | Updated on Apr 15 2026 7:56 AM

హుబ్లీ: గత నెలలో నిరుద్యోగుల పోరాటం యావత్‌ రాష్ట్రం దృష్టిని ఆకర్షించిన నేపథ్యంలో మంగళవారం ధార్వాడలో చేపట్టిన నిరుద్యోగుల ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. ముగ్గురు విద్యార్థి సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్నారు. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా నిరుద్యోగులు ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల నియామకాల కోసం గత రెండు నెలల నుంచి ఎడతెగకుండా పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం కూడా ధార్వాడ జూబ్లీ సర్కిల్‌ నుంచి డీసీ కార్యాలయం వరకు భారీగా ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి చురుకు ముట్టించాలన్న నేపథ్యంలో చేపట్టిన ఆందోళనలను పోలీసులు శాంతి భద్రతల కారణంగా అడ్డుకొని అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర విద్యార్థి సంఘం నేతృత్వంలో 2.84 లక్షల ఖాళీల పోస్టుల భర్తీ కోసం చేపట్టిన ఆందోళలో ధార్వాడలోని శ్రీనగర, జయనగర, సప్తాపుర తదితర చోట్ల భారీ భద్రత ఏర్పాటు చేశారు.

ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న వైనం

Advertisement
 
Advertisement
Advertisement