భక్తిశ్రద్ధలతో కుంటి మారెమ్మవ్వకు పూజలు | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో కుంటి మారెమ్మవ్వకు పూజలు

Apr 15 2026 7:56 AM | Updated on Apr 15 2026 7:56 AM

సాక్షి,బళ్లారి: గుగ్గరహట్టిలో వెలసిన కుంటి మారెమ్మవ్వకు మంగళవారం విశేష పూజలతో పాటు సుమారు 8 వేల మంది భక్తులకు అన్నదానం నెరవేర్చారు. స్థానిక ప్రముఖులు కమల్‌ సూరి కుటుంబ సభ్యుల సారథ్యంలో కుంటి మారెమ్మవ్వకు తెల్లవారు జాము నుంచి ప్రత్యేక పూజ విశేష కార్యక్రమాలు నెరవేర్చారు. ఈ పూజ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి పాల్గొన్నారు. మొత్తం మీద ఉదయం నుంచి మంగళవారం అంతా మారెమ్మ అవ్వ గుడి ప్రాంగణం భక్తులతో కోలాహలంగా, సందడిగా కనిపించింది.

పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు

సుమారు 8 వేల మందికి అన్నదానం

Advertisement
 
Advertisement
Advertisement