నాగేశ్వరస్వామి రథోత్సవం
బొమ్మనహళ్లి: బెంగళూరు నగర జిల్లా పరిధిలోని ఆనేకల్ తాలూకాలోని హెన్నాగరలో సోమవారం శ్రీనాగేశ్వర స్వామి రథోత్సవం, శ్రీయల్లమ్మ దేవి జగద పాలక్కి ఉత్సవం భక్తిశ్రద్ధలతో జరిగాయి. మధ్యాహ్నం శ్రీనాగలింగేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించి తేరులో ఆసీనుల్ని చేశారు. పూజలు చేసి తేరును లాగారు. వీరగాసె, డొల్లుకుణిత, పూజా కుణిత తదితర కళాకారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. వేలాదిగా భక్తులు, ఆనేకల్ టీఏపీసీఎంఎస్ అధ్యక్షుడు ఎం.బాబురెడ్డి, హెచ్.జే.ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.
బొమ్మనహళ్లి: చిక్కమగళూరు జిల్లాలోని కడూరు తాలూకాలోని బిరూర్ సమీపంలోని హోగరేహళ్లి గ్రామంలో సోమవారం శ్రీలక్ష్మీ రంగనాథస్వామి బ్రహ్మ రథోత్సవం వైభవంగా సాగింది. శ్రీరంగనాథస్వామి, శ్రీదేవి, భూదేవిల విగ్రహాలను అలంకరించి రథంలో ప్రతిష్టించారు. రథ పతాకాన్ని వేలం వేయగా ఎమ్మెల్యే కె.ఎస్.ఆనంద్ రూ. 5.05 లక్షలకు గెలుచుకున్నారు. పూజల తరువాత భక్తులు ఆనందోత్సాహాలతో తేరును లాగారు. వివిధ పూజా వేడుకలు, సాంస్కృతిక ప్రదర్శనలు భక్తులను రంజింపజేశాయి. పలు జిల్లాల నుంచి జనం తరలివచ్చారు.


