మండ్య: మండ్య జిల్లాలోని ప్రఖ్యాత మేలుకోటలోని శ్రీ చెలువ నారాయణస్వామి దేవస్థానంలో కొడై తిరునాల్ ఉత్సవం శోభాయమానంగా సాగుతోంది. అలంకార ప్రియుడైన మహావిష్ణు చెలువనారాయణస్వామి కోసం ప్రతి రాత్రి ప్రత్యేక అలంకరణలతో ఒక వేడుక జరుగుతోంది. ఏప్రిల్ 4వ తేదీ నుంచి మొదలైన కొడై తిరునాల్‌లో భాగంగా ఏకాదశి సందర్భంగా సోమవారం నాడు ప్రత్యేకంగా అలంకరించారు.
కొడై తిరునాల్ ప్రత్యేకత
వైరముడి బ్రహ్మోత్సవం ముగియగానే ప్రారంభమయ్యేదే కొడై తిరునాల్ సంబరం. ఏప్రిల్ 17వ తేదీ అంటే శుక్రవారం అమావాస్య రాత్రి వరకు కొనసాగుతుంది. కొడై తిరునాల్ ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ అమ్మవారి సమక్షంలో, అర్చకులుమంత్రాలు, రామాయణం, సంస్కృత పద్యాలతో మంగళ వాయిద్యాల మధ్య చెలువనారాయణ స్వామిని పూజిస్తారు. తరువాత పానక ప్రసాదాన్ని సమర్పిస్తారు. బంగారు ఆభరణాలను ధరించి, పద్మాసనంలో కూర్చున్న స్వామిని చూడడానికి భక్తులు వేచి చూస్తారు.
మేలుకోటె పుణ్యక్షేత్రంలో
17 వరకు విశేష ఉత్సవాలు


