శివాజీనగర: చిక్కమగళూరు జిల్లా ఎన్.ఆర్.పురం తాలూకాలో నిర్మాణమైన వంతెనను సీఎం సిద్దరామయ్య సోమవారం ప్రారంభించారు. హందూరు, హొన్నకుడిగ గ్రామాల నుంచి నరసింహరాజపురకు భద్రా నది బ్యాక్ వాటర్‌పై ఈ వంతెన నిర్మాణమైంది. సీఎం, ఎమ్మెల్యేలు, అధికారులతో కలిసి వంతెనను వీక్షించారు. భద్రా నది సౌందర్యాన్ని వీక్షించారు.
504 మీటర్ల పొడవు...
504 మీటర్ల పొడవు కలిగిన ఈ వంతెనకు సిద్దరామయ్య వంతెన అని పేరు పెట్టడం గమనార్హం. సుమారు రూ.38 కోట్ల ఖర్చుతో నిర్మాణం పూర్తయింది. 2017లో సీఎం సిద్దరామయ్య దీనికి శంకుస్థాపన చేశారు. అనేక గ్రామాల ప్రజలకు రాకపోకలకు అనుకూలమవుతుంది. ఉదయం, సాయంత్రం వేళలో ఇక్కడ సుందరమైన దృశ్యాలు ఆవిష్కృతమవుతాయి. జిల్లాలోనే ఇది పొడవైన సేతువుగా నిలిచింది.
చిక్కమగళూరులో సేవలకు అంకితం


