హనీట్రాప్‌లో చిక్కి.. బాడీబిల్డర్‌ ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

హనీట్రాప్‌లో చిక్కి.. బాడీబిల్డర్‌ ఆత్మహత్య

Apr 14 2026 7:52 AM | Updated on Apr 14 2026 7:52 AM

దొడ్డబళ్లాపురం: బెంగళూరులో జిమ్‌ ట్రైనర్లు మహిళలను మోసం చేయడమో, లేదా వారి చేతిలో మోసపోయి ఆత్మహత్య చేసుకోవడమో పెరిగిపోయింది. ఇటీవలే ఓ యువతి ప్రేమించి, చివరకు తిరస్కరించడంతో ఓ జిమ్‌ శిక్షకుడు ఆత్మహత్య చేసుకోవడం తెలిసిందే. ఇంతలోనే హనీట్రాప్‌లో చిక్కుకున్న బాడీ బిల్డర్‌ మహిళ బెదిరింపులకు భయపడి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ విషాద ఘటన నెలమంగల తాలూకా వాజరహళ్లిలో వెలుగుచూసింది. జిమ్‌ ట్రైనర్‌ దిలీప్‌ (28)కు, రోజూ జిమ్‌కు వస్తున్న వివాహిత (42)తో పరిచయమైంది. అతడు బాడీబిల్డర్‌గా రాష్ట్రంలో ఎన్నో పోటీల్లో రాణించాడు. ఇద్దరూ సన్నిహితంగా మెలిగేవారు, తరువాత ఆమె డబ్బు, అతని ఆస్తులు కావాలని బ్లాక్‌మెయిల్‌ చేయడం ప్రారంభించిందని దిలీప్‌ కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆదివారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడానికి ముందు దిలీప్‌ ఆమెకు కాల్‌ చేసి చెప్పాడు. దీంతో ఆమె అతని తమ్మునికి ఇన్‌స్టాలో మెసేజ్‌ చేసింది. కానీ అంతలోనే దిలీప్‌ ప్రాణాలు పోయాయి. నెలమంగల టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మోసగత్తెను కఠినంగా శిక్షించాలని దిలీప్‌ కుటుంబీకులు డిమాండ్‌ చేశారు.

ఐఏఎస్‌ రోహిణికి

సుప్రీంలో ఊరట

బనశంకరి: మైసూరు కలెక్టర్‌గా ఉన్న కాలంలో బట్ట బ్యాగుల కొనుగోలులో అక్రమాలు జరిగాయనే కేసులో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిణి రోహిణి సింధూరికి సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. ఆమైపె నమోదైన కేసులో విచారణకు అనుమతివ్వాలని రాష్ట్ర హైకోర్టు ఇటీవల ప్రభుత్వాన్ని ఆదేశించడం తెలిసిందే. హైకోర్టు ఆదేశాలను ప్రశ్నిస్తూ రోహిణి సింధూరి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. సోమవారం విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు ఆదేశాలపై స్టే జారీ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement