రాయచూరు రూరల్: నిరుద్యోగ యువత ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ పిలుపునిచ్చారు. ఆదివారం కన్నడ భవనంలో జిల్లా అధికార యంత్రాంగం, జిల్లా పంచాయతీ, ఉద్యోగ ఉపాధి కేంద్రం ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేడు డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులు తమకు ఇష్టమైన ఉపాధి మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. స్వయం ఉపాధికి ప్రాధాన్యత కల్పించాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా అధికారి ని్‌తీష్, జిల్లా పంచాయతీ సీఈఓ ఈశ్వర్ కుమార్ కాందూ, ఎస్పీ అరుణాంగ్శు గిరి తదితరులు పాల్గొన్నారు.
అంబులెన్స్ ప్రారంభం
రాయచూరు రూరల్: ప్రజలు అంబులెన్స్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని ఉప్పార వాడిలో విస్తార పైనాన్ష్ సేవా ట్రస్ట్, బాలంకు ఆస్పత్రి ఆద్వర్యంలో నూతన అంబులెన్సును ప్రారంభించారు. ఆదివారం జరగనున్న మెగా ఆరోగ్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో మాజీ శాసన సభ్యుడు బసనగౌడ, నాగరాజ, బి.వి. నాయక్, బండేష్ తదితరులు పాల్గొన్నారు.


