పోలీసులకు యోగా శిక్షణ ఉపయుక్తం | - | Sakshi
Sakshi News home page

పోలీసులకు యోగా శిక్షణ ఉపయుక్తం

Apr 13 2026 7:26 AM | Updated on Apr 13 2026 7:26 AM

హొసపేటె: సమాజంతో శాంతి భద్రతలను పరిరక్షించే పోలీసులు నిత్యం శారీరకంగా, మానసికంగా ధృడంగా ఉండాలి. త్వరలో డీఎంఐ యంత్రం ద్వారా స్థూలకాయ పరీక్షను తప్పనిసరి చేయనున్నట్లు ఎస్పీ ఎస్‌.జాహ్నవి తెలిపారు. ఆదివారం నగరంలో డీఏఆర్‌ పోలీస్‌ పరేడ్‌ మైదానంలో హొసపేటె ఉప విభాగం పోలీస్‌ అధికారులు, సిబ్బంది కోసం పతాంజలి యోగా సమితి జిల్లా విభాగం ఆధ్వర్యంలో 15 రోజుల ఉచిత యోగా శిక్షణ శిబిరం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. యోగా అనేది ఒక జీవన విధానంగా మారాలని సూచించారు. ఈ శిక్షణ కేవలం జిల్లా కేంద్రంలోనే కాకుండా మిగిలిన రెండు ఉప విభాగాల్లో కూడా నిర్వహించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ మంజునాథ్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement