రాయచూరు రూరల్: నగరంలో కాళికా మాత జయంతి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ఆదివారం విశ్వకర్మ సమాజం ట్రస్ట్, వందలాది మంది భక్తుల సముక్షంలో అమ్మవారికి అభిషేకం చేశారు. ఈ సందర్భంగా కాళికా దేవిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అమ్మవారి విగ్రహాన్ని పల్లకీలో కొలువుదీర్చి ఊరేగించారు. దేవికి పూలు పండ్లు, దవనం, ధాన్యాలతో పూజలు చేశారు. అంతకుముందు ముత్తయిదువులు కలశాలతో ఊరేగింపు చేపట్టారు. కార్యక్రమంలో ఈశ్వర్, నారాయణ, జయంతాచారి, నాగరాజ్, రవీంద్ర, లక్ష్మీపతి, హరినాథ్, మల్లేష్, మౌనేష్, ఆనంద శ్రీకాంత్, గిరిబాబు, వినోద, ఆకాష్, హరహరన్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


