ప్రేమ పేరుతో వంచించాడు | - | Sakshi
Sakshi News home page

ప్రేమ పేరుతో వంచించాడు

Apr 12 2026 6:17 AM | Updated on Apr 12 2026 6:17 AM

రాయచూరు రూరల్‌: ఎనిమిది ఏళ్లు ప్రేమించి పెళ్లికి నిరాకరించిన యువకుడిపై యువతి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దేవదుర్గ తాలూకా అంజళ గ్రామానికి చెందిన హనుమంతి, మల్లికార్జున బెంగళూరులో చదువుకుంటున్న సమయంలో ఇద్దరు ప్రేమలో పడ్డారు. హనుమంతితో కలసి మల్లికార్జున వివిధ ప్రాంతాలకు తిరిగాడు. వీరిద్దరి మధ్య ఏడు సంవత్సరాల పాటు ప్రేమాయణం నడిచింది. పెళ్లి చేసుకోవాలంటూ హనుమంతి పలుమార్లు కోరినా.. అప్పుడు చేసుకుంటా, ఇప్పుడు చేసుకుంటా అని చెప్పి మల్లికార్జున కాలం వెల్లదీశాడు. ఇటీవల హనుమంతి మళ్లీ పెళ్లి ప్రస్తావన తీసుకుని రాగా.. పెళ్లి చేసుకునేందుకు మల్లికార్జున నిరాకరించాడు. ‘నీ కులం వేరు. ఇంట్లో కుటుంబ సభ్యులు వివాహానికి అభ్యంతరాలు చెబుతున్నారు. నీవు మరొకరిని వివాహం చేసుకోవాలని’ చెప్పాడు. దీంతో యువతి హనుమంతి దేవదుర్గ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దేవదుర్గ పోలీసులు కేసును రాయచూరు సదర్‌ బజార్‌ పోలీస్‌ స్టేషన్‌కు బదలాయించారు. బాధితురాలు హనుమంతి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అతిథి ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తుండగా.. దేవదుర్గలో మల్లికార్జున నీటి పారుదల శాఖలో జూనియర్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. సదర్‌ బజార్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

యువతితో ఎనిమిది ఏళ్లుగా

ప్రేమాయణం

కులం వేరు అని చెప్పి

పెళ్లికి నిరాకరణ

యువకుడిపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన బాధితురాలు

Advertisement
 
Advertisement
Advertisement