హత్య కేసులో 10 మందికి యావజ్జీవ శిక్ష | - | Sakshi
Sakshi News home page

హత్య కేసులో 10 మందికి యావజ్జీవ శిక్ష

Apr 12 2026 6:17 AM | Updated on Apr 12 2026 6:17 AM

రాయచూరు రూరల్‌: హత్య కేసులో 10 మందికి యావజ్జీవ శిక్ష విధిస్తూ రాయచూరు 3వ అదనపు జిల్లా జడ్జి శుక్రవారం తీర్పు వెలువరించారు. లింగసూగురు తాలుకా గుడదనాళలో పంచాయతీ కార్యాలయం విషయంలో ఫిబ్రవరి 10, 2021వ తేదీన హన్మంతమ్మ, శరణ బసవ, అమరేష్‌పై దాడి జరిగింది. శరణ బసవకు తీవ్ర గాయాలు కావడంతో చికిత్సల నిమిత్తం బాగల్‌కోట అస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శరణ బసవ మృతి చెందాడు. హన్మంతమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. దాడికి పాల్పడిన జగదీష్‌, మయనూర్‌, మహంకాళప్ప, బసవరాజ్‌ డొడ్డముని, హనుమంతి, దురుగప్ప, కెంచమ్మ, యల్లప్ప, యల్లమ్మ, నింగప్పకు యావజ్జీవ శిక్ష విధిస్తూ రాయచూరు 3వ అదనపు జిల్లా జడ్జి, లింగసూగురు న్యాయమూర్తి జి.బి.జకాతి తీర్పు ఇచ్చారు. ఈ కేసులో ప్రభుత్వ న్యాయవాది మంజునాథ్‌ వాదనలు వినిపించారు.

Advertisement
 
Advertisement
Advertisement