అర్హులకే ఉద్యోగ అవకాశాలు | - | Sakshi
Sakshi News home page

అర్హులకే ఉద్యోగ అవకాశాలు

Apr 12 2026 6:17 AM | Updated on Apr 12 2026 6:17 AM

హొసపేటె: ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేటప్పుడు స్థానికులైన అర్హులైన అభ్యర్థులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎటువంటి అవినీతికి తావు లేకుండా అభ్యర్థుల ఎంపికను పారదర్శకంగా నిర్వహించాలని నూతన డీహెచ్‌ఓ డాక్టర్‌ వినయ్‌కు స్లమ్‌ ఆర్గనైజేషన్‌ సభ్యులు కోరారు. డీహెచ్‌ఓ డాక్టర్‌ వినయ్‌ మాట్లాడుతూ.. తమ శాఖలో అవినీతికి ఎటువంటి అస్కారం లేదన్నారు. కేవలం అర్హులైన, తగిన అభ్యర్థులను మాత్రమే ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. స్థానికులకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలకు ఆరోగ్య శాఖ సేవలను సమర్థవంతంగా అందించేందుకు తమవంతు కృషి చేస్తామని వెల్లడించారు. పరిపాలన సంస్కరణల కోసం ప్రజలు, వివిధ సంస్థల నుంచి వచ్చే సూచనలు కూడా ఎంతో ముఖ్యమన్నారు. కార్యక్రమంలో ఆరోగ్య శాఖ అధికారులు జంబయ్య నాయక్‌, దర్శన్‌ గౌడ్‌, రాజీవ్‌, స్లమ్‌ ఆర్గనైజేషన్‌ అధ్యక్షుడు హెచ్‌.శేషు, ఉపాధ్యక్షుడు తన్వీర్‌ అహ్మద్‌, ప్రధాన కార్యదర్శి ఎన్‌.వెంకటేష్‌, రామచంద్ర బాబు, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ గుత్తి కై లాస్‌, మహిళా విభాగం అధ్యక్షురాలు ఎన్‌.హులిగెమ్మ, ఉపాధ్యక్షురాలు నూర్‌ జహాన్‌, ప్రధాన కార్యదర్శి బినరూపలత, జాఫ్రీన్‌, ఫేక్‌ మెహబూబ్‌ బాషా, ఎల్‌.పాండు నాయక్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement