రాయచూరు రూరల్: పట్టణ ప్రాంతంలో నివాసానికి పేరు (మ్యుటేషన్) మార్చేందుకు లంచం తీసుకుంటూ సిరవార పట్టణ పంచాయతీ ముఖ్య అధికారి సురేష్ శెట్టి లోకాయుక్త అధికారులకు పట్టుబడ్డారు. వివరాలు.. సిరవార పట్టణానికి చెందిన రాఘవేంద్ర రెడ్డి తన ఇంటి పేరు మార్చాలని పంచాయతీ ముఖ్య అధికారి సురేష్ శెట్టిని కలిశారు. పేరు మార్చాలంటే రూ.2 లక్షలు ఇవ్వాలని సురేష్ శెట్టి డిమాండ్ చేయడంతో రాఘవేంద్ర రెడ్డి రూ.లక్ష ఇచ్చాడు. అయితే పని పూర్తి చేయకుండా కాలయాపన చేశాడు. మిగతా రూ.లక్ష ఇస్తేనే పని పూర్తి చేస్తానని సురేష్ శెట్టి తెలిపారు. అంత డబ్బు తన వద్ద లేదని రాఘవేంద్ర రెడ్డి చెప్పినా వినిపించుకోలేదు. మనస్తాపానికి గురైన రాఘవేంద్ర రెడ్డి.. ఈ విషయాన్ని లోకాయుక్త అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. శుక్రవారం సురేష్ శెట్టి డబ్బు తీసుకుంటుండగా లోకాయుక్త అధికారులు దాడి చేశారు. లోకాయుక్త అధికారులను గమనించిన ముఖ్య అధికారి సురేష్ శెట్టి కారులో కవితాళ వైపు పరారీ అయ్యారు. మైబెల్ లొకేషన్ ఆధారంగా సురేష్ శెట్టి జాడను పోలీసులు గుర్తించారు. కవితాళ ప్రభుత్వ అతిథి భవనంలో తల దాచుకున్నట్లు తెలుసుకున్న అధికారులు అక్కడికి వెళ్లి అరెస్ట్ చేశారు.
రూ.లక్ష లంచం తీసుకుంటూ పట్టుబడిన సిరవార పట్టణ
పంచాయతీ ముఖ్య అధికారి


