రూ.3 కోట్ల విలువైన మొబైల్స్‌ స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

రూ.3 కోట్ల విలువైన మొబైల్స్‌ స్వాధీనం

Apr 11 2026 9:28 AM | Updated on Apr 11 2026 9:28 AM

సాక్షి, బళ్లారి: ఇటీవల మొబైల్స్‌ దొంగతనాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. మొబైల్స్‌ దొంగలించారంటూ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. నూటికి 90 శాతం దొంగిలించిన మొబైల్స్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవడం పోలీసులకు సవాల్‌గా మారుతోంది. అయితే గడిచిన ఆరు నెలల్లో విజయపుర పోలీసులు ఘనమైన విజయం సాధించారు. విజయపుర జిల్లా పరిధిలో పలు ప్రాంతాల్లో దొంగలించిన మొబైల్స్‌ను సీఈఐఆర్‌ సాఫ్ట్‌వేర్‌ సాయంతో కనుక్కున్నారు. 26 పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఆరు నెలల్లో దాదాపు రూ.3 కోట్ల విలువైన మొబైల్స్‌ను జిల్లా ఎస్‌పీ లక్ష్మణ్‌ నింబరిగి ఆధ్వర్యంలో స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఫోన్లను సంబంధిత యజమానులకు అప్పగించడంతో వారు సంతోషం వ్యక్తం చేశారు. మొబైల్‌ ఫోన్లు ఎక్కడైనా ఎవరైనా దొంగలిస్తే తక్షణం ఫిర్యాదు చేయాలని సూచించారు. పూర్తి వివరాలు కూడా అందజేయాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement