కెలమంగలం: తళి నియోజకవర్గంలో అన్నాడీఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి పార్టీ శుక్రవారం తాలూకా కేంద్రం డెంకణీకోటలో ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించింది. బీజేపీ క్రిష్ణగిరి పశ్చిమ జిల్లా అధ్యక్షుడు నారాయణన్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి అన్నాడీఎంకే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వేపనపల్లి సిటింగ్ ఎమ్మెల్యే కే.పి.మునిస్వామి ముఖ్య అతిథిగా హాజరై కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు బీజేపీ అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలన్నారు. నాగేష్ కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంిపీ నరసింహన్, బీజేపీ క్రిష్ణగిరి పశ్చిమ జిల్లా మాజీ అధ్యక్షులు నాగరాజ్, మండల అధ్యక్షులు బాలక్రిష్ణన్, నరేంద్రన్, రవీంధ్రన్, అన్నాడీఎంకే నాయకులు జేపి జయప్రకాష్, రాము, యూనియన్ కార్యదర్శి రమేష్ రెడ్డి, వెంకటా చలపతిశెట్టి పెద్ద ఎత్తున కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.


