కోలారు: నగరంలోని కారంజి కట్టలో ద్రౌపతమ్మ దేవి, ధర్మరాయస్వామి కరగ ఉత్సవాన్ని గురువారం రాత్రి అత్యంత వైభవంగా నిర్వహించారు. దేవాలయం ముందు భాగంలో వేసిన వేదికపై కరగ పూజారి బేతమంగల మునిరాజు నిర్వహించిన కరగ నృత్యం అందరిని విశేషంగా ఆకట్టుకుంది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. గోవింద నామ స్మరణతో వేదిక ప్రాంగణం మార్మోగింది. ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్, ఎమ్మెల్సీ ఎం ఎల్ అనిల్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే వర్తూరు ప్రకాష్ తదితర ప్రముఖులు కరగ ఉత్సవంలో పాల్గొన్నారు.
వీధి కుక్కలకు ఫీడింగ్ జోన్
కోలారు: వీధి కుక్కల ఆకలితీర్చడం కోసం తాలూకాలోని వేమగల్ – కురుగల్ పట్టణ పంచాయతీలో బస్టాండు, కోలారు రోడ్డు, సీతి రోడ్డు, కల్వమంజలి రోడ్డు, లలో ఫీడింగ్ జోన్‌లను ఏర్పాటు చేశారు. జోన్‌లలో ఎవరైనా ఆహారం వేయవచ్చు. స్థానిక హోటల్ యజమానులు మిగిలిన రుచికరమైన ఆహారాన్ని తెచ్చి ఫీడింగ్ జోన్‌లలో వేయవచ్చునని పట్టణ పంచాయతీ అధికారులు తెలిపారు. పట్టణ పంచాయతీలో 1726 కుక్కలను గుర్తించగా వాటిలో 976 కుక్కలకు సంతానహరణ చికిత్సలు చేయించినట్లు తెలిపారు. రేబిస్ వ్యాప్తి చెందకుండా టీకాలు వేయించినట్లు అధికారులు తెలిపారు.


