మల్లికార్జున ఖర్గేను అరెస్ట్‌ చేయాలి | - | Sakshi
Sakshi News home page

మల్లికార్జున ఖర్గేను అరెస్ట్‌ చేయాలి

Apr 11 2026 9:28 AM | Updated on Apr 11 2026 9:28 AM

హొసపేటె: రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను తక్షణమే అరెస్టు చేయాలని బీజేపీ యువ మోర్చా కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. శుక్రవారం పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు కొట్రేష్‌ మాట్లాడుతూ.. అస్సాం ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్నారు. ‘నమాజ్‌ చేసేటప్పుడు విష సర్పం కనిపిస్తే దానిని చంపాలని ఖురాన్‌లో రాసి ఉంది. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ కూడా అలాంటి విష సర్పాలే. మీరు దానిని చంపక పోతే అది బ్రతకదు. ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యులను చంపాలని ముస్లింలను రెచ్చగొట్టారు’ అని ఆరోపించారు. మల్లికార్జున ఖర్గే ఎల్లప్పుడూ మైనార్టీలను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారని మండిపడ్డారు. అటువంటి వ్యక్తి చేసిన బాధ్యతారహితమైన రెచ్చగొట్టే ప్రసంగం దేశంలోని లక్షలాది బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ సభ్యుల ప్రాణాలను ప్రమాదంలో పడేసిందన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు శంకర్‌మేటి, మండల ప్రధాన కార్యదర్శి మధురచెన్న శాస్త్రి హిరేమఠ్‌్‌, యువ మోర్చా మండల అఽధ్యక్షుడు హెచ్‌.రాఘవేంద్ర, కే.మధుసూదన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement