ట్రెక్కర్లకు కొత్త నియమాలు! | - | Sakshi
Sakshi News home page

ట్రెక్కర్లకు కొత్త నియమాలు!

Apr 10 2026 10:33 AM | Updated on Apr 10 2026 10:33 AM

శివాజీనగర: రాష్ట్రంలో కొండ ప్రాంతాల్లో పాదయాత్ర, పర్వాతారోహణ తదితరాలకు వెళ్లి టూరిస్టులు తప్పిపోవడం, ప్రమాదాలకు గురి కావడంతో అటవీ శాఖ కొత్త మార్గదర్శకాలను అమలు చేయాలని నిర్ణయించింది.

కొడగు జిల్లా తడియాండమల్‌ కొండకు ట్రెక్కింగ్‌కు వచ్చిన కేరళ యువతి శరణ్య దారితప్పి మూడు రోజుల పాటు అడవిలోనే చిక్కుకొంది. చిక్కమగళూరు జిల్లాలో బాలిక శ్రీనంద అదృశ్యమైంది. ఇలాంటి ఘటనలతో పర్యాటకానికి చెడ్డపేరు వస్తుందని ప్రభుత్వం ఆందోళనగా ఉంది.

ఏమేం చర్యలు?

పర్యాటకుల రక్షణకు చర్యలు తీసుకోవాలని అటవీ మంత్రి ఈశ్వర ఖండ్రె తమ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ ట్రాకింగ్‌ అనే యాప్‌ను రూపొందించాలని, ట్రెక్కర్ల మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకుంటే దారితప్పినప్పుడు జీపీఎస్‌ ద్వారా కనిపెట్టవచ్చని పేర్కొన్నారు. ట్రెక్కర్లతో పాటు ఉండే నేచర్‌ గైడ్‌లకు తప్పకుండా వైర్‌లెస్‌ సమాచార వ్యవస్థ కల్పించాలన్నారు. ట్రెక్కర్లకు గ్రూపు ఇన్సూరెన్స్‌ ఉండాలని తెలిపారు.

ప్రమాదాల నేపథ్యంలో అటవీ

మంత్రి ఆదేశం

Advertisement
 
Advertisement
Advertisement