ద్వితీయ పీయూసీలో ర్యాంకుల పంట | - | Sakshi
Sakshi News home page

ద్వితీయ పీయూసీలో ర్యాంకుల పంట

Apr 10 2026 10:33 AM | Updated on Apr 10 2026 10:33 AM

కొట్టూరు విద్యార్థినులకు రాష్ట్రానికే ద్వితీయ స్థానం

హొసపేటె: విజయనగర జిల్లా కొట్టూరుకు చెందిన హిందూ పీయూ కళాశాల విద్యార్థినులు సంగీత, అర్చన అనే ఇద్దరు 600 మార్కులకు గాను 598 మార్కులను సాధించడం ద్వారా రాష్ట్రానికే ద్వితీయ స్థానం పొందారు. రాష్ట్రంలో మూడబిదిరె నివాసి దిశ కామర్స్‌లో 600 మార్కులకు గాను 600 మార్కులు సాధించి రాష్ట్రానికి ప్రథమ స్థానంలో నిలిచింది.

విషరహితంగా

పంటలు పండించాలి

కోలారు: నేటి రోజుల్లో విషంతో కూడిన ఆహార పదార్థాలను పండిస్తున్నారు, ఇది మానవ ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపిస్తోంది, రైతులు విషరహిత ఆహార ఉత్పాదనకు ప్రాధాన్యతనివ్వాలని జిల్లా కలెక్టర్‌ ఎంఆర్‌ రవి తెలిపారు. గురువారం జిల్లా పంచాయతీ, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్‌ కార్యాలయ ఆడిటోరియంలో నిర్వహించిన విషరహిత ఆహార ఉత్పాదన వైపు కోలారు జిల్లా ఒక అడుగు అనే సదస్సులో ఆయన మాట్లాడారు. వ్యవసాయం కేవలం శ్రమ మాత్రమే కాదని అదొక విజ్ఞానమని అన్నారు. రైతులు పంటలకు రోగాలు వస్తే రసాయనిక దుకాణాల వద్దకు వెళ్లకుండా, నిపుణుల సలహాల కోసం రైతులు సంప్రదించేందుకు వీలుగా అగ్రి క్లినిక్‌లను స్థాపించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని తెలిపారు. కార్యక్రమంలో ఉప వ్యవసాయ డైరెక్టర్‌ ఎస్‌ నాగరాజ్‌, ఐిసీఏఆర్‌ ఢిల్లీ నివృత్త అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement