రాయచూరు రూరల్: వేసవిలో తాగునీటి ఎద్దడి నెలకొనకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులు, మంత్రులు, ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేసినా స్పందించక పోవడాన్ని తప్పుబడుతూ ప్రజలు ఆందోళన చేపట్టిన ఉదంతం రాయచూరు జిల్లాలో చోటు చేసుకుంది. 15 రోజులైనా కొళాయిలకు తాగునీటిని వదలక పోవడంతో లింగసూగూరు తాలూకా సర్జాపురలో రైతులు, గ్రామస్తులు గ్రామ పంచాయతీ అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. తాగునీరు అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడాన్ని ఖండిస్తూ గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు.


