మైసూరు: దివ్యాంగులను సమాజంలో ప్రధాన స్రవంతిలోకి తేవాలని పోలీసు పబ్లిక్ పాఠశాల ప్రిన్సిపాల్ దీనా తిమ్మయ్య తెలిపారు. మైసూరు నగరంలోని రాజరాజేశ్వరి నగరలోని నిరీక్ష ప్రత్యేక పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా నిరీక్ష ఉత్సవ అనే వేడుకను నిర్వహించారు. దేవుడు అందరికీ అన్ని అవయవాలను సక్రమంగా ఇచ్చాడన్నారు. అయితే కొందరికి లోటు చేయడం వల్ల శారీరక, మానసిక వైకల్యంతో బాధపడుతున్నట్లు దీనా తెలిపారు. న్యూనతలను కలిగిన పిల్లలు సమాజంలోకి నిరాదరణకు గురికాకుండా చూసుకోవాలన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్నారు.


